: వైసీపీ గందరగోళంతో ఏపీ శాసనసభ రేపటికి వాయిదా


ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు సభలో ప్రకటన చేస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డు తగిలి ఆందోళన చేశారు. దాంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం ప్రకటన చేయకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఆందోళనను విరమించి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పలువురు అధికారపక్ష సభ్యులు కోరారు. అయినా వినకుండా వైసీపీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News