: ఆఫ్రికా ఖండంలో ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది యువతుల దుర్మరణం
ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశం స్వాజిలాండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. 50 మందితో ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ ట్రక్కు మార్గమధ్యంలో మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో 38 మంది యువతులు ప్రాణాలను వదిలారు. ఆ దేశ రాజు ఎంస్వతి-3 ముందు ఆడి, పాడేందుకు వీరంతా వెళుతున్నారు. రాజు తన కొత్త భార్యను ఎంచుకునే ఈ సాంప్రదాయ వేడుకకు దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున యువతులు వెళుతుంటారు. వీరిలో నుంచి ఒక యువతిని తన కొత్త భార్యగా రాజు స్వీకరిస్తాడు.