: నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం వైసీపీకే చెల్లింది... అసెంబ్లీలో చంద్రబాబు విమర్శ


ప్రతిపక్షం వైసీీపీపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముప్పేట దాడి కొనసాగించారు. నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా ఆయన తేల్చిచెప్పారు. పలుమార్లు వాయిదా పడ్డ తర్వాత కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చను ప్రారంభించిన క్రమంలో పార్లమెంటు రికార్డులను బయటకు తీశారు. ఎంపీ హోదాలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను జగన్ ఉపసంహరించుకున్నారని వ్యాఖ్యానించారు. దీనికి అడ్డుచెప్పిన వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం ఒక్క వైసీపీకే చెల్లిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News