: అప్పుడే తిరిగొచ్చిన స్వైన్ ఫ్లూ మహమ్మారి


శీతాకాలం ప్రవేశించకుండానే స్వైన్ ఫ్లూ మహమ్మారి తిరిగొచ్చింది. సూరత్ లో ఓ మహిళను బలిగొంది. హెచ్1ఎన్1 వైరస్ సోకి, వరచ్చా ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల మహిళ మరణించిందని, మరో 58 సంవత్సరాల వ్యక్తికి, 28 ఏళ్ల యువతికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. మరో 11 మందిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని తెలిపారు. ఈ సీజన్ లో స్వైన్ ఫ్లూ సందర్భంగా మరణించిన తొలి కేసు ఇదేనని వివరించారు. ఈ మహమ్మారికితోడు ఆగస్టు నెలలో 83 మందికి డెంగ్యూ, 1,079 మందికి మలేరియా సోకాయని అధికారులై తెలియజేశారు. స్వైన్ ఫ్లూ మరింతగా విస్తరించకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు రూపొందించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News