: డీఎస్ కు క్యాబినెట్ హోదా ఎందుకు?: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ప్రశ్న
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో నేడు ఆసక్తికర వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితుడైన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత డి.శ్రీనివాస్ కు క్యాబినెట్ హోదాను కల్పించడంపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రత్యేక సలహాదారులకు క్యాబినెట్ హోదా అవసరమా? అని ప్రశ్నించిన హైకోర్టు, కేసీఆర్ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఇటీవల తెరాసలో చేరిన డీఎస్ ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేసీఆర్ నియమించారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసి, కొన్ని పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసిన రాజయ్య, సచివాలయంలో వాడుకున్న గదిని డీఎస్ కు కేటాయించగా, ఆయన గత వారంలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.