: బియ్యం ధర కంటే ఇసుక ధరే ఎక్కువయ్యేటట్లుంది!... ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య


ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు రంగంలోకి దిగిన విష్ణుకుమార్ ఒక్కసారిగా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా నేటి అసెంబ్లీ సమావేశంలోనూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక అంశం చిచ్చు రేపుతోందని ఆయన అన్నారు. 'కిలో బియ్యం ధర కంటే, కిలో ఇసుక ధరే ఎక్కువయ్యేటట్టు ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News