: అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ లో బూతు వీడియోలు... హ్యాకర్ల దుశ్చర్య


సోషల్ మీడియాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు విశేష ఆదరణ ఉంది. అభిమానులు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను వేలంవెర్రిగా చూస్తారు. దీంతో అత్యధిక మంది ఫాలోయర్లున్న స్టార్లలో ఆయన అగ్రాసనాన్ని అధిష్టించారు. ఇంతటి ప్రజాదరణ ఉన్న అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ లోకి హ్యాకర్లు ఎంటరయ్యారు. బూతు బొమ్మలున్న వీడియోలను అప్ లోడ్ చేశారు. అయితే అభిమానులు తన ట్విట్టర్ లోని బూతు బొమ్మలను చూడడానికి ముందుగానే అమితాబ్ వాటిని గమనించి తొలగించేశారు. అంతేకాక తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు అరగంట క్రితం అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ మెసేజ్ పెట్టారు. ‘‘నా ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. కొన్ని బూతు బొమ్మలు చేరిపోయాయి. ఎవరు చేశారో తెలియదు. నాకు వాటితో అవసరం లేదు’’ అంటూ ఆయన ట్వీటారు.

  • Loading...

More Telugu News