: సల్మాన్ కు సుప్రీంలో ఊరట ... బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయనకు ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు మేలో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనిని రద్దు చేయాలంటూ ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్ (చనిపోయాడు) తల్లి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని పరిశీలించిన కోర్టు నేడు కొట్టివేసింది.