: ప్రత్యేక హోదా వద్దు... ప్రత్యేక ప్యాకేజీయే కావాలి: చింతా మోహన్


ఓపక్క ఏపీకి ప్రత్యేక హోదానే కావాలని పలువురు నేతలు కేంద్ర్రాన్ని డిమాండ్ చేస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. 200 మంది పారిశ్రామిక వేత్తలు ఆదాయపు పన్ను ఎగ్గొట్టేందుకే ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తమకు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీయే కావాలని కోరారు. తిరుపతిలో ఈరోజు కృష్ణదేవరాయ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమకు రూ.57వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, చిత్తూరు జిల్లాకు రూ.10వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News