: ఏ మాత్రమూ మారని అసెంబ్లీ... రగడ రగడే!


ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరు ఎంత మాత్రమూ మారలేదు. గతంలో జరిగినట్టుగానే ఇప్పుడూ జరుగుతోంది. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా వైకాపా ప్రయత్నిస్తుంటే, ప్రతి అంశంపైనా మరింత లోతుగా వెళ్లకుండా ప్రభుత్వం తప్పించుకుంది. కేవలం గంట వ్యవధిలో మూడు సంతాప తీర్మానాలను ఆమోదించిన సభ వాయిదా పడింది. ఒక వైపు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఆపై చర్చలో రభస సాగడం, స్పీకర్ కల్పించుకుని తీర్మానం ఆమోదం పొందిందని ప్రకటించడం... ఇదే అసెంబ్లీలో నేడు కనిపించిన దృశ్యం. తొలుత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించి, సంతాప తీర్మానం ఆమోదించే వరకూ సభ సజావుగా సాగింది. ఆపై గోదావరి మహా పుష్కరాల తొలి రోజు తొక్కిసలాట, అనంతరం ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ యువత బలిదానాలు అంశాలపై ఎవరూ మాట్లాడకుండానే తీర్మానాలు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించేశారు. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని వైకాపా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు తదితరులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. సంతాప తీర్మానంలో విమర్శలు సరికాదంటూ, స్పీకర్ కోడెల చర్చను పొడిగించకుండా, మరే వ్యక్తికీ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకుండా సంతాప తీర్మానాలను ముగించేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News