: నిరుద్యోగులందరికీ శుభవార్త... ఇక ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు: ప్రకటించిన మోదీ


ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియ తొలగిపోనుంది. కిందిస్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెండు వారాల్లో విడుదల చేయనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో కింది స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? అని ప్రశ్నించిన ఆయన తాజా 'మన్ కీ బాత్'లో ఇంటర్వ్యూలను తొలగించాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఇంటర్వ్యూలకు రమ్మని పిలవగానే, నిరుపేద నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు సిఫార్సులు, సహాయం కోసం పరుగులు పెట్టడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ఆయన అభిప్రాపడ్డారు. ఇంటర్వ్యూలు తొలగిస్తే అవినీతి జరగదని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News