: జగన్ పై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించిన అచ్చెన్నాయుడు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే వేడి పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి ఘాట్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటపై చర్చ జరుగుతున్న సందర్భంలో, వైకాపా అధినేత జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. జగన్ లాంటి ఒక 'మూర్ఖుడు' రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉండటం బాధాకరమని అన్నారు. దీంతో, స్పీకర్ కోడెల కల్పించుకుని మంచి భాషను ఉపయోగించాలని సూచించారు.