: మందుకొట్టి ఆట చూస్తూ, పట్టుతప్పి పడిపోయి..!


యూఎస్ లోని అట్లాంటా... న్యూయార్క్, యాంకీస్ జట్ల మధ్య బేస్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు కూర్చునేందుకు, ప్రత్యేకంగా కేటాయించిన స్టాండులో పైన ఉన్న బాల్కనీ నుంచి ఓ వ్యక్తి దబ్బున కింద పడ్డాడు. ఏం జరిగిందో తెలియని వాళ్లంతా భయంతో పరుగులు తీశారు. పైనుంచి పడటంతో తీవ్రగాయాల పాలైన అతనిని భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆటను చూసేందుకు వచ్చిన ఆ అభిమాని తాగిన మత్తులో ఉన్నాడని, బాల్కనీ నుంచి పట్టుతప్పి పడిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఏదో దాడి జరుగుతోందని ఒక్క క్షణం తామంతా హడలిపోయినట్టు ఆటగాళ్ల బంధువులు తెలిపారు.

  • Loading...

More Telugu News