: కర్ణాటకలో కొత్తగా మూడు ఇన్ఫోసిస్ క్యాంపస్ లు, 27 వేల మంది టెక్కీలకు ఉద్యోగాలు
ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ కర్ణాటకలో నెలకొల్పదలచిన మూడు భారీ ఐటీ ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 1,918 కోట్ల రూపాయలతో ఇన్ఫీ కొత్త క్యాంపస్ లను ప్రారంభించాలని నిర్ణయించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఉన్నత స్థాయి క్లియరెన్స్ కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వీటి ద్వారా 27 వేల మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించనుందని ఈ సందర్భంగా సిద్ధరామయ్య తెలియజేశారు. ఒక క్యాంపస్ ఎలక్ట్రానిక్ నగరంలో, మరో రెండు కొనప్పన అగ్రహారంలో ఏర్పాటు కానున్నాయని వివరించారు.