: ఓ ఇంటిదైన 'భరణి' భామ


విశాల్ నటించిన 'భరణి' చిత్రం గుర్తుందా? ఆ సినిమాలో చిలిపి నవ్వు, అందమైన రూపంతో అలరించిన హీరోయిన్ భాను అలియాస్ ముక్తా వివాహం చేసుకుంది. మలయాళ గాయని నిమీ టోనీ సోదరుడు రింగూ టోమీతో భాను వివాహం కొచ్చిలోని సెయింట్ జార్జ్ చర్చ్ లో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి వధూవరుల తరపు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళంలో పొన్నర్ శంకర్, అళగర్ మలై తదితర చిత్రాల్లో నటించిన ఆమె తాజా చిత్రం 'వాసువుమ్ శరవణన్ ఒన్నా పడిచ్చవంగ' ఇటీవలే థియేటర్లను తాకింది.

  • Loading...

More Telugu News