: అసెంబ్లీ సమావేశాలను 15 రోజులకు పొడిగించాలన్న వైసీపీ... ఐదు రోజులు చాలన్న టీడీపీ
ఏపీ శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సమావేశాల కొనసాగింపునకు విపక్ష వైసీపీ పట్టుబట్టగా, అధికార టీడీపీ తిప్పికొట్టింది. వైసీపీ తరఫున సమావేశానికి హాజరైన జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సమావేశాలను 15 రోజులకు పొడిగించాలని డిమాండ్ చేశారు. కీలక అంశాలను చర్చించాల్సి ఉన్నందున ఐదు రోజులు సరిపోవని ఆయన వాదించారు. జ్యోతుల నెహ్రూ వాదనను అధికార పక్షం తిప్పికొట్టింది. ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లోనే అన్ని అంశాలపై చర్చిద్దామని అధికార పక్షం తరఫున హాజరైన సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పారు.