: ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి... అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన ఏపీ సీఎం


టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఘన నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లిన చంద్రబాబు, ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ నేతలను చంద్రబాబు పేరు పేరునా పలుకరించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తర్వాత చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలిసి అక్కడి నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.

  • Loading...

More Telugu News