: పశ్చిమ గోదావరి జిల్లాలో మరో వ్యక్తికి 'సూది'పోటు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. సైకో సూదిగాడి దెబ్బకు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం ఉదయం ఓ చిన్నారికి ఇంజక్షన్ చేసిన ఆ ఉన్మాది కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి పంజా విసిరాడు. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఓ వ్యక్తికి సూది గుచ్చి పరారయ్యాడు. ఆ వ్యక్తిని 108 అంబులెన్సులో తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించారు. కాగా, సూదిగాడి ఉన్మాదానికి గురైన బాధితుల సంఖ్య 16కి చేరినట్టు సమాచారం. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా అతడు దొరక్కపోవడంతో ప్రజల్లో భయం రాజ్యమేలుతోంది.