: ఆమె చెప్పేదంతా అబద్ధం: కాంబ్లీ
బేబీ కేర్ టేకర్ కు జీతం ఇవ్వకుండా నిర్బంధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దంపతులు ఎట్టకేలకు మీడియాకు అందుబాటులోకి వచ్చారు. ఆమె చెప్పేదంతా అబద్ధమని కాంబ్లీ స్పష్టం చేశారు. తాము ఆమెను ఇబ్బంది పెట్టలేదని, ఆ ఆరోపణలను ఆమె నిరూపించాలని అన్నారు. ఈ వ్యవహారంలో బేబీ కేర్ టేకర్ పై చర్యలు తీసుకుంటామని కాంబ్లీ భార్య ఆండ్రియా తెలిపారు. రెండేళ్లుగా సరిగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని సోనీ సరళ్ అనే బేబీ కేర్ టేకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇంటికి వెళ్లనివ్వకుండా తాజాగా గదిలో పెట్టి తాళం వేశారని తన ఫిర్యాదులో పేర్కొంది.