: ఢిల్లీలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఖుష్బూ చౌదరి ఆత్మహత్య


ఢిల్లీలోని 'ఎయిమ్స్' వైద్య కళాశాల విద్యార్థిని ఖుష్బూ చౌదరి (19) ఆత్మహత్యకు పాల్పడింది. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన ఖుష్బూ ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది. ఖుష్బూ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దాంతో, ఆత్మహత్యకు గల కారణాలపై అంచనాలకు రాలేకపోతున్నారు. పోలీసులు ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. కాగా, ఖుష్బూ ఎప్పుడూ చలాకీగా ఉండేదని స్నేహితులు తెలిపారు. అటు, ఎయిమ్స్ కూడా ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News