: ఉద్యమాన్ని పక్క రాష్ట్రాలకూ పాకిస్తాడట!


గుజరాత్ లో పటేల్ వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ తో కొనసాగుతున్న ఉద్యమం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. అందుకు కారణం హార్దిక్ పటేల్. ఈ యువకుడు తన వాగ్ధాటి, పోరాట పటిమతో రాష్ట్రంలో పటేల్ వర్గాన్ని పోరు బాట పట్టించాడు. మీడియా కూడా ఈ 22 ఏళ్ల కుర్రాడిపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. ప్రధాని మోదీ అయితే ఈ యువకుడి ఆవేశం చూసి, సంయమనం పాటించాలంటూ సూచించాల్సి వచ్చింది. ఇప్పుడీ యువ పటేల్ తన ఉద్యమాన్ని జాతీయ స్థాయికి విస్తరిస్తానంటుండడం నిజంగా ప్రభుత్వాలకు ఇబ్బందికరమే. గుజ్జర్లు, కుర్మీలను కలుపుకుని ముందుకుసాగుతామని హార్దిక్ స్పష్టం చేశారు. ఇప్పటికే, పలు వర్గాల నేతలతో సమావేశమైన హార్దిక్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. "ఉద్యమాన్ని జాతీయస్థాయికి విస్తరిస్తాం. మాతో మమేకమైన దాదాపు 12 రాష్ట్రాల ప్రజలను కలుపుకుని రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. మా ఆందోళన 100 మీటర్ల రేసు కాదు ఇప్పటికిప్పుడు ముగియడానికి. అదో మారథాన్ రేసు వంటిది. 1 నుంచి 2 ఏళ్లు పట్టవచ్చు. పలు రాష్ట్రాల్లో ఉన్న మా వర్గీయులను కూడగట్టి పోరాడాలన్నదే నా అభిమతం. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఎక్కడ పటేల్ వర్గం నన్ను కోరుకుంటుందో, అక్కడికి వెళతా" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News