: కోహ్లీ సేనకు అండగా నిలిచిన వరుణుడు... 21/3 స్కోరు వద్ద నిలిచిపోయిన మ్యాచ్
టీమిండియాను వరుణుడు మరోసారి ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో లంక పేసర్లు జోరుమీదున్న సమయంలో ప్రత్యక్షమై భారత్ పతనాన్ని అడ్డుకున్న వానదేవుడు, రెండో ఇన్నింగ్స్ లోనూ తన ఉనికిని చాటుకున్నాడు. మూడో రోజు ఆట చివరి సెషన్ లో, టీమిండియా స్కోరు 3 వికెట్లకు 21 పరుగుల వద్ద వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. లంక బౌలర్ ప్రదీప్ 2 వికెట్లు, ప్రసాద్ ఓ వికెట్ తో భారత్ ను కష్టాల్లోకి నెట్టారు. దాంతో, భారత్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పుజారా డకౌట్ కాగా, రాహుల్ 2, రహానే 4 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (1 బ్యాటింగ్), రోహిత్ శర్మ (14 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ ఆధిక్యం 132 పరుగులు కాగా, చేతిలో 7 వికెట్లున్నాయి.