: షాకిచ్చిన లంక పేసర్లు... పెవిలియన్ చేరిన టీమిండియా ఓపెనర్లు
కొలంబో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 111 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన టీమిండియాకు రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో లంక పేసర్లు షాకిచ్చారు. పుజారా (0)ను దమ్మిక ప్రసాద్ డకౌట్ చేయగా, కేఎల్ రాహుల్ (2) ను ప్రదీప్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత జట్టు 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులకు ఆలౌటైంది.