: పంజా విసిరిన లంబూ... విలవిల్లాడిన లంకేయులు
కొలంబో టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ 5 వికెట్లతో సత్తా చాటాడు. పేసర్లకు సహకరిస్తున్న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ పై పొడగరి ఇషాంత్ నిప్పులు చెరగడంతో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్ లో పెరీరా 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెరాత్ 49, ప్రసాద్ 27 పరుగులు చేశారు. ఇషాంత్ కు తోడు బిన్నీ (2 వికెట్లు), మిశ్రా (2 వికెట్లు) కూడా రాణించడంతో టీమిండియాకు 111 పరుగుల కీలక అధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ సేన 312 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.