: ఏపీ యువకులకు కల్వకుంట్ల కవిత సూచన


తెలంగాణ సీఎం కేసీఆర్ తరపున టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బలిదానాలు సాగుతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు ఇకనైనా మౌనం వీడాలని అన్నారు. చంద్రబాబు మౌనం ఏపీ ప్రజలకు శాపంలా పరిణమించిందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా, ఇప్పటికైనా ప్రధాని మోదీని గట్టిగా అడగాలని హితవు పలికారు. తెలంగాణకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్న విషయాన్ని తాము కేంద్రానికి వివరించామని తెలిపారు.

  • Loading...

More Telugu News