: సైకో కోసం జల్లెడ పడుతున్నారు: చినరాజప్ప
పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్న సూదిగాడి ఉదంతంపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను భయపెడుతున్న సైకో కోసం జల్లెడ పడుతున్నామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు మంత్రి తెలిపారు. అటు, ఏపీ పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీఎం వద్ద ఉందని చెప్పారు. త్వరలోనే ఎస్సై, కానిస్టేబుల్, డ్రైవర్ల రిక్రూట్ మెంట్ ప్రకటన ఉంటుందని అన్నారు.