: రాష్ట్రాన్ని వీడని అల్పపీడన ద్రోణి
రాష్ట్రాన్ని అల్పపీడన ద్రోణి వీడేలా కనిపించడం లేదు. ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ఈ ద్రోణి కారణంగా కోస్తాంధ్రలో ఈరోజు సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అటు విదర్భ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన మరో ద్రోణి ప్రభావంతో రాయలసీమ, తెలంగాణలోనూ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.