: సైకో 'సూది'గాడు మళ్లీ వచ్చాడు... ఈసారి చిన్నారికి గుచ్చాడు!
పోలీసులకు చిక్కకుండా తన ఉన్మాదాన్ని కొనసాగిస్తున్న సైకో 'సూది'గాడు మళ్లీ వచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను వణికిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి ఈసారి రెండేళ్ల చిన్నారిని లక్ష్యంగా చేసుకున్నాడు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిమోడిలో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బైక్ పై వెళుతుండగా, ఉన్మాది ఆ చిన్నారికి ఇంజక్షన్ చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సదరు ఉన్మాది ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి ఇంజక్షన్ చేసి పారిపోతుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భయానక వాతావరణం నెలకొని ఉంది.