: వంద ఓవర్ల పాటు క్రీజులోనే పుజారా... 312 పరుగులకు టీమిండియా ఆలౌట్


లంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 312 పరుగులకు తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. 292/8 ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఉదయం ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన టీమిండియా మరో 20 పరుగులు చేసి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది. ఇదిలా ఉంటే, టీమిండియా ఇన్నింగ్స్ ను లోకేశ్ రాహుల్ తో కలిసి ప్రారంభించిన ఛటేశ్వర్ పుజారా చివరి దాకా బ్యాటింగ్ చేశాడు. పుజారాను ఔట్ చేయడం లంక బౌలర్లకు సాధ్యపడలేదు. ఏకంగా వంద ఓవర్ల పాటు క్రీజులో ఉన్న పుజారా, 289 బంతులను ఎదుర్కొని 14 ఫోర్ల సహాయంతో 145 పరుగులు సాధించాడు. ఓపెనర్ గా వచ్చిన పుజారా ఓపక్క తన సహచరులంతా వచ్చిన దారిలోనే వెనుదిరుగుతున్నా మొక్కవోని దీక్షతో భారత ఇన్నింగ్స్ ను ప్రమాదం నుంచి రక్షించాడు.

  • Loading...

More Telugu News