: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రం బాధ్యత... హామీని నెరవేర్చాల్సిందేనంటున్న కోడెల


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పార్లమెంటు సాక్షిగా మాజీ ప్రధాని ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చి తీరాల్సిందేనని ఆయన అన్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ప్రకటనలో కేంద్రం జాప్యం చేస్తే ప్రజల్లో సెంటిమెంట్ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు విలువైన సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News