: తెలంగాణ బాటలో ఏపీ... జడ్పీ చైర్ పర్సన్ వేతనాన్ని రూ.40 వేలకు పెంచిన చంద్రబాబు సర్కారు


రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. మొన్నటికి మొన్న ఉద్యోగుల ఫిట్ మెంట్ కు సంబంధించి తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఏపీ సర్కారు కూడా అడుగు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుల వేతనాల విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా నిర్ణయం తీసుకోక తప్పలేదు. తాజాగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాల విషయంలో ఇదే తరహా ధోరణి కనిపించింది. జడ్పీ చైర్మన్ వేతనాన్ని రూ.7,500ల నుంచి ఒకేసారి రూ. లక్షకు పెంచుతూ కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలోనూ తమ వేతనాలు పెంచాలని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ స్థాయిలో కాకున్నా, చంద్రబాబు ప్రభుత్వం కూడా జడ్పీ చైర్మన్ల వేతనాలను రూ.40 వేలకు పెంచింది. ఈ మేరకు నిన్నటి కేబినెట్ భేటీలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పనిలో పనిగా జడ్పీటీసీ, ఎంపీపీల వేతనాలను రూ.6 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం, సర్పంచ్ ల వేతనాన్ని రూ.3 వేలకు పెంచింది.

  • Loading...

More Telugu News