: స్కూటరెక్కిన రోజా... తిరుపతి బైక్ ర్యాలీలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి ఆర్కే రోజా స్కూటరెక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు సర్కారు విఫలమైన తీరుకు నిరసనగా వైసీపీ నిన్న ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఏపీ వ్యాప్తంగా నిరసనలను హోరెత్తించారు. బంద్ లో భాగంగా తిరుపతిలో ఆ పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాలుపంచుకున్న రోజా స్కూటరెక్కారు. తెలుపు రంగు హోండా యాక్టివాను రోజా స్వయంగా నడుపుతూ ముందుకు సాగడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు.