: 'అఖిల్' టీజర్ ను రిలీజ్ చేసిన సల్మాన్


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని తొలి సినిమా 'అఖిల్' టీజర్ ను విడుదల చేశాడు. టీజర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతోందో వినాయక్ అభిమానులకు హింట్ ఇచ్చాడు. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రూపొందిన సినిమాలో అఖిల్ పోరాట దృశ్యాలు చూపించారు. పోరాట దృశ్యాల్లో అఖిల్ ఈజ్ చూసి సినిమా అదిరిపోతుందని నాగార్జున అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా, శ్రేశ్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ నిర్మిస్తున్న 'అఖిల్' సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించగా; అఖిల్ సరసన సయేషా సైగల్ కథానాయికగా పరిచయం అవుతోంది. నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా టీజర్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేయడం విశేషం.

  • Loading...

More Telugu News