: కొనసాగుతున్న జమైకా చిరుత జైత్రయాత్ర


బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ జైత్రయాత్ర కొనసాగుతోంది. నేడు జరిగిన 400 మీటర్ల రిలేలో ఉసేన్ బోల్ట్ బృందం స్వర్ణం సాధించింది. 37.36 సెకన్లలో రేసు ముగించిన నలుగురు సభ్యుల జమైకా రిలే జట్టు స్వర్ణంతో సత్తా చాటింది. దీంతో వ్యక్తిగతంగా బోల్ట్ మూడు స్వర్ణాలు సాధించినట్టైంది. వంద మీటర్ల రేసు, రెండు వందల మీటర్ల రేసుల్లో స్వర్ణాలు సాధించిన బోల్ట్ తాజాగా రిలేలో కూడా విజయం సాధించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. 100 మీటర్ల మహిళల విభాగంలో జమైకాకు చెందిన షెల్లీ స్వర్ణం సాధించడంతో పరుగు పందేలలో ఇప్పటి వరకు జమైకా జట్టు ఆరు స్వర్ణాలు సాధించింది.

  • Loading...

More Telugu News