: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం...నిరాహార దీక్ష విరమించండి: అచ్చెన్నాయుడు


ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీకి ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటును మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటును రద్దు చేసిందని అన్నారు. అయితే ఆ సందర్భంగా నాగార్జున కంపెనీకి ఇచ్చిన 972 ఎకరాల భూమిలో సదరు సంస్థ మల్టీ ప్రోడక్ట్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. తాజా నిర్ణయంతో సుదీర్ఘ కాలంగా అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్న వారు విరమించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News