: బీపీ నుంచి రక్షణ కావాలా?...ఇవి తింటూ హ్యాపీగా ఉండండి!
రక్తపోటు, రక్తప్రసరణలో సమస్యలతో బాధపడే వారు భయపడాల్సిన అవసరం లేదని, ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభయమిస్తున్నారు. కొన్ని రకాల మాంసకృత్తులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చని వారు చెబుతున్నారు. చేపలు, మాంసం, పప్పుదినుసులు, కేబేజీ పువ్వు, బచ్చలికూర, పాల ఉత్పత్తుల్లో లభించే మాంసకృత్తులు, రక్తపోటు, రక్త ప్రసరణ సమస్యలను మాత్రమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను సైతం నయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని వారు తెలిపారు. అమైనో ఆమ్లం అధికంగా ఉండే ఆహార పదార్థాలు హృదయానికి రక్షణ కవచంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.