: కుప్పకూలిన వైకాపా మాజీ ఎమ్మెల్యే... ఐసీయూకు తరలింపు


వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఏమయిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు వైకాపా చేపట్టిన బంద్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో, మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఒక్కసారిగా కూలిపోయారు.

  • Loading...

More Telugu News