: నన్నూ చంపాలని మత్తు మందిచ్చింది: ఇంద్రాణిపై కుమారుడి ఫిర్యాదు


సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్యకేసు విచారణలో భాగంగా ఇంద్రాణి కుమారుడు మిఖాయిల్ ను విచారించిన పోలీసులు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. షీనాను హత్య చేసిన రోజు మిఖాయిల్ కూడా ముంబైలోనే ఉన్నాడని, ఆరోజే కొడుకును కూడా హత్య చేయాలని ఇంద్రాణి పథకం వేసిందని పోలీసులు తేల్చారు. ఆస్తి విషయమై మాట్లాడాలని రమ్మని చెప్పి, తనను ముంబై, వర్లి లోని 'హిల్ టాప్' హోటల్లో పెట్టారని, అనంతరం తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారని విచారణలో మిఖాయిల్ వెల్లడించాడు. దాన్ని తాగగానే తల తిరిగినట్టు అనిపించిందని, అదే సమయంలో తన తల్లి, సంజీవ్ ఖన్నాలు బయటకు వెళ్లారని తెలిపాడు. పీటర్ ముఖర్జియా విదేశాల్లో ఉన్న సమయంలో తనను పిలవడం, తల్లితో పాటు ఖన్నా కూడా ఉండటంతో, ఇక్కడ ఏదో జరుగుతోందన్న అనుమానం వచ్చి, తాను హోటల్ రూమ్ నుంచి పారిపోయినట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని వారి డ్రైవర్ రాయ్ కూడా అంగీకరించాడని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. మిఖాయిల్ కి మత్తుమందు ఇచ్చిన తర్వాత వారు షీనా వద్దకు వెళ్లి, ఆమెను తీసుకుని వెళ్లి, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అంతం చేశారని, ఒకవేళ మిఖాయిల్ హోటల్ లోనే వుండి వుంటే కనుక అతను కూడా రెండో బాధితుడు అయివుండేవాడని పోలీసు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News