: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సుల ధర్నా
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు ధర్నాకు దిగారు. ఇటీవల ఎలుకల దాడిలో పసికందు చనిపోయిన ఘటన నేపథ్యంలో డాక్టర్ భాస్కర్ రావు బదిలీ, ఇద్దరు నర్సులను ప్రభుత్వం సస్సెండ్ చేసిన సంగతి తెలిసింది. దాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎల్లుండి నుంచి నిరసన తీవ్రతరం చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్యవిద్య సంచాలకుడికి వైద్యులు, నర్సులు వినతిపత్రం సమర్పించారు.