: చంద్రబాబు దగ్గరికి వెళ్లేందుకు పోటీపడ్డ మహిళలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లాలని, ఆయన చేతికి రాఖీలు కట్టాలని మహిళలు పోటీ పడ్డారు. ఈ ఉదయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన రాగా, అప్పటికే అక్కడ వందల సంఖ్యలో వేచిచూస్తున్న మహిళలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. అతికష్టం మీద వారిని అదుపు చేసిన పోలీసులు పరిమిత సంఖ్యలో మాత్రమే మహిళలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు సైతం మహిళలతో రాఖీలు కట్టించుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఆపై మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాగా, 42 కీలక అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. డీఆర్డీఓకు భూమి కేటాయింపు, వెటర్నరీ, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు తదితర ఎన్నో విషయాలు చర్చకు రానున్నట్టు సమాచారం.