: తెలంగాణ చరిత్ర అక్కర్లేదు... పాఠ్యాంశాలు మార్చిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే, ఏపీకి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా అదే పని చేసింది. ఎనిమిదో తరగతిలో ఉన్న నిజాం ఉద్యమ చరిత్ర, తొమ్మిదిలో తెలంగాణ మాండలికంలో ఉన్న పాఠాలు, ఉపవాచకంలోని కాపు రాజయ్య, మిద్దె రామారావుల చరిత్రలను తొలగించారు. పదో తరగతి తెలుగులో ఉన్న హైదరాబాద్ నగరం వివరాలు, బసవేశ్వర చరిత్ర, సాంఘిక శాస్త్రంలో సింగరేణి కాలరీస్ గురించిన సమాచారం, ఖనిజాల వివరాలు తీసివేశారు. ఈ పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షల్లో అడగబోరని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు.