: తెలుగు రాష్ట్రాలకు హ్యండిచ్చిన అల్పపీడనం!
రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలపై కరుణ చూపలేదు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఏపీ, తెలంగాణల వైపు వస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించగా, అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ గఢ్ వైపుగా వెళ్లిపోయింది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఎటువంటి వర్షాలూ కురిసే అవకాశాలు లేవని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఇక తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన ద్రోణి కారణంగా అక్కడక్కడా చిరు జల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నా, రైతుల అవసరాలు తీరి, ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే సూచనలు కనిపించడం లేదు.