: ప్రత్యేక హోదా రాకుంటే పోరుబాటలోకి తెలుగుదేశం: సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకుంటే తాము కూడా ప్రత్యక్ష పోరులోకి దిగుతామని తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి వివరించారు. కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, అవి ఫలిస్తాయన్న నమ్మకం ఉందని అన్నారు. వైకాపా చేస్తున్న బంద్ తో జన జీవనం స్తంభిస్తోందని, ఇలా ధర్నాలు చేపట్టడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.