: కోర్టు స్టే ఇచ్చినా 'గో అహెడ్' అన్న క్రీడామంత్రిత్వ శాఖ... నేడు సానియాకు ఖేల్ రత్న


భారత క్రీడారంగంలో ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల్లో అత్యుత్తమమైనదిగా భావించే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా నేడు అందుకోనుంది. ఆమెకీ పురస్కారాన్ని ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారా ఒలింపియన్ హెచ్ఎన్ గిరీషా వేసిన పిటిషన్ పై స్పందించిన కర్ణాటక హైకోర్టు సానియాకు ఖేల్ రత్నపై స్టే విధించినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం, తాము ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి వున్నట్టు స్పష్టం చేసింది. టెన్నిస్ రంగంలో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ ర్యాంకులో ఉన్న సానియా ఈ అవార్డుకు అర్హురాలని తేల్చింది. అవార్డు విజేతల వివరాలను చివరి నిమిషంలో మార్చలేమని, అవార్డు కమిటీ సిఫార్సుల మేరకు సానియాకు అవార్డు ఇస్తామని, ఈ నిర్ణయమే ఫైనల్ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కోర్టు నోటీసులు అందాయని, దానిపై సమాధానం ఇస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News