: ఉత్తరాఖండ్ మహిళలకు రాఖీ కానుక
ఉత్తరాఖండ్ లో మహిళలకు అక్కడి ప్రభుత్వం రక్షాబంధన్ కానుకను ప్రకటించింది. రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే మహిళల నుంచి బస్సు ఛార్జీలు వసూలు చేయవద్దని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అధికారులను ఆదేశించారు. రేపు దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు తాపత్రయపడతారని, అలాంటి వారికి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. మహిళా గౌరవానికి ప్రతీకగా రక్షా బంధన్ నిలుస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలని ఆయన చెప్పారు.