: ముక్కూమొహం తెలియని వ్యక్తికి క్షమాపణలు చెప్పిన సోనాక్షీ సిన్హా


ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ముక్కూమొహం తెలియని ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పింది. క్షమాపణలు చెప్పడం చిన్నతనం కాదని, అందర్లాగే తాను కూడా పొరపాటుపడ్డానని, అయితే క్షమాపణలు చెప్పడం ద్వారా తన తప్పు సరిదిద్దుకున్నానని సోనాక్షి అభిప్రాయపడింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని తిలక్ నగర్ లోని సిగ్నల్స్ దగ్గర సరబ్ జీత్ సింగ్ అనే యువకుడు వేధించాడంటూ జస్లీన్ కౌర్ అనే యువతి సోషల్ మీడియాలో అతని ఫోటో పెట్టి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇది వైరల్ గా షేర్ అయ్యి ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఆ యువతికి 5 వేల రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తామని ప్రకటించారు. ఇంతలో ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా, ఆ రోజు అదే సిగ్నల్ దగ్గరున్న ఓ యువకుడు సరబ్ జీత్ ఆమెను వేధించలేదని, ఆ యువతే కావాలని కథ అల్లిందని పోలీసులకు చెప్పాడు. దీనిపై స్పందించిన సోనాక్షీ సిన్హా సదరు యువకుడికి ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది.

  • Loading...

More Telugu News