: మా అంకుల్ ఐఎస్ఐ చీఫ్ పదవికి పోటీ పడ్డారు... మా చుట్టం పాక్ ఫారెన్ సెక్రటరీగా పనిచేశారు: సైఫ్ అలీ ఖాన్


'ఫాంటమ్' సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాక్ తీవ్రవాదం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా విడుదలపై పాకిస్థాన్ లో నిషేధం విధించారు. తాజాగా, ఈ సినిమా గురించి హీరో సైఫ్ మాట్లాడుతూ... పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ పదవికి పోటీపడిన మేజర్ జనరల్ ఇస్ఫందియార్ అలీ ఖాన్ పటౌడీ తన అంకుల్ అని, బాల్యంలో వాళ్ల పిల్లలతో కలసి తాను ఆడుకున్నానని తెలిపారు. పాక్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన షహర్యార్ ఖాన్ (పాక్ క్రికెట్ బోర్డు ప్రస్తుత చీఫ్) తమకు బంధువేనని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను దేశాన్నే మిన్నగా భావిస్తానని, ఆ తర్వాతే బంధువులని సైఫ్ స్పష్టం చేశారు. భారత్ ను వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ తాను వ్యతిరేకిస్తానని ఉద్ఘాటించారు. ఇక, ముంబయి పేలుళ్ల ఘటన సూత్రధారి జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ అని సైఫ్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News