: బంద్ నేపథ్యంలో రేపు విశాఖలో 144 సెక్షన్...పోలీసుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన బంద్ పై విశాఖపట్టణం పోలీసులు స్పందించారు. రేపు జరగనున్న బంద్ సందర్భంగా విశాఖపట్టణంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలు నేటి అర్ధ రాత్రి నుంచి అమలులోకి వస్తాయని, బంద్ సందర్భంగా ఎవరూ ఆయుధాలు ధరించి తిరగకూడదని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. శాంతియుత పద్ధతుల్లో బంద్ నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.