: డెడ్ సీ... నిజంగానే చచ్చిపోతోంది!


ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఈజిప్టు దేశాలను తాకుతూ ఉండే డెడ్ సీ వాస్తవానికి ఓ ఉప్పునీటి కాసారం. డెడ్ సీ నీటి లవణీయత చాలా ఎక్కువ. అంతా ఉప్పుమయం! సుందరమైన తీర ప్రాంతాలకు ఈ మృత సముద్రం పెట్టింది పేరు. పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... డెడ్ సీ క్రమేణా కుచించుకుపోతోంది. నీటి పరిమాణం ఏడాదికి మీటర్ కు పైగా తరిగిపోతోంది. ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాలకు చెందిన కంపెనీలు నిస్సారమైన దక్షిణ బేసిన్ లో ఖనిజ లవణాల వెలికితీత కోసం భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టడం, డెడ్ సీకి ప్రధాన నీటి వనరుగా ఉన్న జోర్డాన్ నది నీటిని దారిమళ్లించడం ఈ పరిస్థితికి దారితీశాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిమాణాన్ని కొనసాగించాలంటే ఈ ఉప్పునీటి సరస్సుకు ఏటా 160 బిలియన్ గాలన్ల నీరు అవసరమవుతుందట. అందుకే, జోర్డాన్ నదిలో నీటి స్థాయిని పునరుద్ధరించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News