: అమెరికాలో నోరూరిస్తున్న 'గోదావరి' రుచులు


మన దేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నప్పటికీ... గోదావరి ప్రాంత రుచుల మాధుర్యమే వేరు. అది వెజ్ కాని, లేదా నాన్ వెజ్ కాని... లొట్టలేసుకుంటూ తినాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే అనేక రెస్టారెంట్లు ఈ రుచులను భోజన ప్రియులకు అందిస్తున్నాయి. మరి, అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న వారి సంగతేమిటి? పీజాలు, బర్గర్లతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఎంత మాత్రం కాదు. ఇకపై ఏ మాత్రం నోరు కట్టేసుకోనక్కర్లేదు. నార్త్ కరోలినాలోని రేలీ సిటీలో భోజన ప్రియులను అలరించడానికి 'గోదావరి' రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది. 'గోదావరి ఇండియన్ రెస్టారెంట్, వోబర్న్' తన తొలి ఫ్రాంఛైజీని రేలీలో రాఖీబంధన్ పండుగ (ఆగస్ట్ 29) సందర్భంగా ప్రారంభించి, అచ్చమైన గోదావరి రుచులతో రేలీ వాసులను పలకరించనుంది. గోదావరి ప్రాంతంలోని రుచుల ప్రామాణికాలను ఏ మాత్రం కోల్పోకుండా... అచ్చమైన కోనసీమ వంటకాలను అందుబాటులోకి తీసుకురానుంది. గోదావరి వంటకాల్లో... నాయుడి గారి నాటు కోడి, రాజుగారి కోడి వేపుడు, కోనసీమ రొయ్యల బిరియానీ, బాబాయ్ ఇడ్లీ, హైదరాబాద్ బిరియానీ, డక్ ఇడ్లీ... ఇలా ఒకటేమిటి, మనం కోరుకున్న రుచులన్నీ మన ముందు ఉండబోతున్నాయి. మరో విషయం ఏమిటంటే, గోదావరి రెస్టారెంట్ లో ఒకేసారి 150 మంది విందు ఆరగించే వీలుంది. అంతేకాదు, ఇందులో ఉన్న బార్ లో ఇండియన్ బీర్ లభిస్తుంది. ఈ రెస్టారెంట్ కు స్పెషలిస్ట్ కేటరింగ్ టీమ్ కూడా ఉంది. మనం జరుపుకునే ఎలాంటి వేడుకలోనైనా వీరు అద్భుతమైన సేవలు అందించగలుగుతారు. బిజీ షెడ్యూల్ వల్ల రెస్టారెంట్ కు స్వయంగా హాజరు కాలేనివారికి మరో సదుపాయాన్ని కూడా రెస్టారెంట్ యాజమాన్యం అందించబోతోంది. రెస్టారెంట్ కు 10 మైళ్ల దూరం వరకు డెలివరీ సదుపాయాన్ని కల్పించనుంది. ఇంకొక విషయం ఏమిటంటే, గోదావరి రెస్టారెంట్ తన ప్రారంభోత్సవ దినాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అంకితం చేయనుంది. గోదావరి రెస్టారెంట్ వెబ్ సైట్ కు వెళ్లాలనుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి.

  • Loading...

More Telugu News